Best Teacher Awards | బోధన్​లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బోధన్ డివిజన్​లో ట్రస్మా ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Best Teacher Awards | బోధన్ (Bodhan) డివిజన్​లో ట్రస్మా (TRSMA Bodhan) ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ఆచార్యదేవోభవ 2026’ పేరుతో స్థానిక ఇందూరు హైస్కూల్​లో కార్యక్రమం జరిగింది.

Best Teacher Awards |ముఖ్య​అతిథిగా డీఈవో..

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో అశోక్(DEO Ashok), విశిష్ట అతిథిలుగా బోధన్ ఎంఈవో నాగయ్య, సాలూర ఎంఈవో మంజూష హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా వారిని డీఈవో ఘనంగా సన్మానించారు. సుమారు 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిశోర్, గౌరవ అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్ రావు, అధ్యక్షుడు ముస్త్యాల హరికృష్ణ, సెక్రెటరీ మంతె సురేష్, కోశాధికారి కృష్ణమోహన్, ట్రస్మా డివిజన్ అధ్యక్షుడు మిద్దెల రాజు, డివిజన్ సెక్రెటరీ అనిల్ కుమార్, డివిజన్ కోశాధికారి సురేష్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వివిధ పాఠశాలలు, కళాశాలల కరెస్పాండంట్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ నుంచి.. ఫస్ట్ ఎలిమినేషన్ అతడేనా..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *