అక్షరటుడే, కామారెడ్డి : Voter Enumeration Drive | జిల్లాలో (Kamareddy)ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావాలని, ఫారమ్ సేకరణలో పారదర్శకత, డిజిటలైజేషన్లో ఖచ్చితత్వం పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డ్రైడే, పాఠశాల తనిఖీ, వనమహోత్సవ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Voter Enumeration Drive | ఫారాలను డిజిటలైజేషన్ చేయాలి
‘సర్’(SIR) కార్యక్రమంలో భాగంగా ఫారమ్ సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూసిన కలెక్టర్, అర్హులైన ప్రతి ఓటరుని గుర్తించి వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎవరూ మినహాయింపు కాకుండా చూసుకోవాలని, బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఫారమ్‌లు సేకరించి సమయానికి సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని సూచించారు. సేకరించిన ఫారమ్‌లను డిజిటలైజ్ చేసి డేటా ఎంట్రీలో పొరపాట్లు రాకుండా ప్రతి ఫారమ్‌ను రెండుసార్లు ధృవీకరించాలని, ప్రక్రియ పూర్తయ్యాక తుది ఓటరు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని, పాఠశాలలు, కళాశాలలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
Voter Enumeration Drive | దోమల వ్యాప్తిని అరికట్టేలా చర్యలు
డ్రై డే సందర్భంగా ఇళ్లు, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమల వ్యాప్తిని అరికట్టి డెంగీ, మలేరియా వంటి కాలానుగుణ వ్యాధులను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వార్డు నెం.35లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం అదే పాఠశాల ప్రాంగణంలో జరిగిన వనమహోత్సవంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించాఉ. అడిషనల్ కలెక్టర్ ఎన్వై గిరి, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, కమిషనర్ పర్వతాలు, 35వ వార్డు కౌన్సిలర్ బోజన్నగారి వినోద, తహశీల్దార్ హిమబిందు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సిరియాలో భారీ పేలుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు పర్యటన వేళ ఘటన..