అక్షరటుడే వెబ్‌డెస్క్: Amaravati Farmers | అమరావతి ప్రాంత రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ (CRDA) సమావేశంలో భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. కౌలు పెంపుతో పాటు, కొత్తగా ల్యాండ్ పూలింగ్‌లో చేరే రైతులకు రుణమాఫీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Amaravati Farmers | ప్రయోజనాలు..
జూన్ 2024 నుండి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలును రూ. 40,000కు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెంపుదల రైతు భూమి ఇచ్చిన నాటి నుండి పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. జరీబు భూములకు అదనంగా రూ. 5,000, మెట్ట భూములకు రూ. 3,000 చొప్పున కౌలు పెంచారు. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి కూడా ఏటా రూ. 10,000 ఆర్థిక సాయం అందించనున్నారు.
Amaravati Farmers | కొత్త వారికి రుణమాఫీ..
కొత్తగా ల్యాండ్ పూలింగ్‌లో చేరే రైతులకు అండగా ఉండేందుకు రుణమాఫీని ప్రకటించారు. అయితే, జనవరి 6, 2026 లోపు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే ఈ వర్తింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయాలు
ఇది కూడా చదవండి: Munnuru Kapu Elections | బ్యాలెట్ పద్ధతిలో మున్నూరు కాపు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తాం