అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi on US Iran Peace Deal | అమెరికా , ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకడం ప్రపంచానికి శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
Modi on US Iran Peace Deal | మోదీ ఏమన్నారంటే..
ఈ మేరకు ప్రధాని తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ, “పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఇప్పుడు అమెరికా, ఇరాన్ ఒక అంగీకారానికి రావడం స్వాగతించదగ్గ పరిణామం” అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం తిరిగి వస్తాయని, ముఖ్యంగా స్వేచ్ఛా నౌకాయానం , అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని భారత్ విశ్వసిస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో మిగిలిన సమస్యలపై కూడా సానుకూల చర్చలు జరిపి, సుస్థిరమైన శాంతిని నెలకొల్పుతారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Modi on US Iran Peace Deal | ఒప్పందంలోని అంశాలు..
ఈ ఒప్పందానికి సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీనిపై అధికారికంగా సంతకాలు చేసేందుకు ఇరుదేశాల ప్రతినిధులు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో భేటీ కానున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం విధించిన ఆంక్షలను పూర్తిగా తొలగించి, నౌకల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంపై కూడా ఇరుదేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఈ పరిణామం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని తొలగించి, స్థిరమైన శాంతికి పునాది వేస్తుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
ఇది కూడా చదవండి: Anganwadi Centers | చిన్నారుల భవితకు అంగన్వాడీ కేంద్రాలే పునాదులు : మంత్రి సీతక్క