అక్షరటుడే వెబ్‌డెస్క్: Stellantis India Investment | ప్రముఖ అంతర్జాతీయ ఆటో మొబైల్ దిగ్గజం స్టెల్లాంటిస్ (Stellantis) భారత మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు బిగ్ ప్లాన్ ప్రకటించింది. ‘ఫాస్ట్‌లేన్ 2030’ (Fastlane 2030) వ్యూహంలో భాగంగా, రాబోయే మూడేళ్లలో తన అనుబంధ బ్రాండ్లు అయిన జీప్ (Jeep) , సిట్రోయెన్ (Citroen) ద్వారా ఏకంగా 12 నూతన వాహనాలను (7 పూర్తిగా కొత్త మోడళ్లు, 5 మేజర్ అప్గ్రేడ్లు) ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.
Stellantis India Investment | రూ.15,000 కోట్లకు..
ఈ కొత్త ప్రణాళికను వేగవంతం చేసేందుకు స్టెల్లాంటిస్ రాబోయే మూడేళ్లలో రూ.4,000 కోట్ల కొత్త పెట్టుబడులను భారత్‌లోకి ( India )తీసుకురానుంది. దీంతో భారత మార్కెట్లో ఇప్పటివరకు పెట్టిన రూ.11,000 కోట్ల పెట్టుబడి, 2030 నాటికి సుమారు రూ.15,000 కోట్లకు చేరనుంది.
మల్టీ-ఎనర్జీ ఆప్షన్లు & మోడళ్లు:
ఈ కొత్త ప్లాన్ ప్రకారం జూన్ 2027 నాటికి (Q2 2027) తొలి వాహనం రోడ్డెక్కనుంది.
వివిధ విభాగాలు: A-సెగ్మెంట్ కార్లు, B, C, D సెగ్మెంట్ SUVలు, MPVలు , ప్రీమియమ్ పికప్ ట్రక్కులు రానున్నాయి.
మల్టీ-ఎనర్జీ ఇంజిన్లు: పెట్రోల్/డీజిల్ (ICE), హైబ్రిడ్ (Hybrid), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), , ఎలక్ట్రిక్ (BEV) టెక్నాలజీల్లో ఈ మోడళ్లు లభించనున్నాయి.
స్థానికత (Localisation): భారత్‌లోని స్థానిక విడిభాగాల వినియోగాన్ని (Localisation) 90% వరకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Stellantis India Investment | గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్‌గా భారత్..
ప్రస్తుతం మహారాష్ట్రలోని రంజన్‌గావ్, తమిళనాడులోని తిరువళ్లూరు , హోసూరులలో స్టెల్లాంటిస్‌కు ప్లాంట్లు ఉన్నాయి. హోసూరు ప్లాంట్‌లో తయారయ్యే 95% ఇంజిన్లు, గేర్‌బాక్స్‌లు ఇప్పటికే దాదాపు 50 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భవిష్యత్తులో భారత్‌ను తయారీతో పాటు గ్లోబల్ ఎగుమతి కేంద్రంగా మరింత బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది.
భారతీయ వినియోగదారులకు విస్తృతమైన ఎంపికలు అందిస్తూ, మార్కెట్లో మరింత పోటీని పెంచడమే తమ లక్ష్యమని స్టెల్లాంటిస్ ఆసియా-పసిఫిక్ సీఓఓ టియాన్షు జిన్ , ఇండియా సీఈఓ శైలేష్ హజేలా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Nizamabad RTA Home Guards | రవాణాశాఖ నుంచి ఇద్దరు హోంగార్డుల సరెండర్