అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 22 market Analysis | పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ(Ceasefire)ను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా హార్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా స్పందిస్తున్నాయి.
గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌తోపాటు, యూరోపియన్ మార్కెట్లు భారీగా నష్టపోగా బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్ డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుండడంతో మన మార్కెట్ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

April 22 market Analysis | యూఎస్ మార్కెట్లు..
అమెరికా, ఇరాన్ మధ్య శాంతిచర్చలపై అనిశ్చిత పరిస్థితి నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌లో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. గత సెషన్‌లో ఎస్ అండ్ పీ 0.63 శాతం, నాస్‌డాక్ 0.59 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.52 శాతం లాభంతో ఉంది.
April 22 market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.16 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 1.06 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.61 శాతం నష్టపోయాయి.
April 22 market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.88 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.52 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.11 శాతం లాభంతో కొనసాగుతుండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.12 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.40 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.26 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.49 శాతం నష్టంతో సాగుతోంది. ఇది మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇస్తోంది.

గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,918 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,221 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.13 నుంచి 1.18 కు పెరిగింది.
- విక్స్ 6.69 శాతం తగ్గి 17.53 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98.28 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.35 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.30 వద్ద ఉన్నాయి.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 36 పైసలు బలహీనపడి 93.49 వద్ద ఉంది.
- ఇరాన్‌పై కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. అయితే హార్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: April 22 Horoscope | రాయల్టీలతో కాసుల వర్షం.. ఈ రాశుల వారికి తలుపు తట్టబోతున్న అదృష్టం!

