May 06 Gold Rates | రూ. 1.5 లక్షల దిగువకు బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

Naresh Chandan
May 06 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 06 Gold Rates | గత కొద్ది రోజులుగా గరిష్ట స్థాయిల వద్ద ఊగిసలాడిన బంగారం ధరలు Gold Rates కాస్త చల్లబడినట్లుగా కనిపిస్తున్నాయి. 2026 మే 6 నాటికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.

ముఖ్యంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,49,170కు పడిపోవడం గమనార్హం. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,740గా నమోదైంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గ్రాముకు రూ.264.90గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది.

May 06 Gold Rates | ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,170గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900గా నమోదైంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,170, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,740గా ఉంది. వెండి ధర కిలోకు రూ.2,64,900గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,220, 22 క్యారెట్ల ధర రూ.1,36,890గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900గా ఉంది.ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900గా ఉంది.

చెన్నైలో Chennai మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,50,760, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,190గా ఉంది. వెండి ధర రూ.2,64,900గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900గా నమోదైంది.

May 06 Gold Rates | బంగారం నుంచి ఇతర ఆస్తులవైపు

బంగారం ధరలు తగ్గడానికి పలు అంతర్జాతీయ, ఆర్థిక కారణాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత సడలడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇతర ఆస్తులవైపు మళ్లుతున్నారు.

అలాగే అమెరికా డాలర్ బలపడడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాలు కూడా పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు, ఇటీవల బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు మొగ్గు చూపడం కూడా ధరలు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను పరిగణలోకి తీసుకుని తుది ధరను నిర్ధారించుకోవడం మంచిది.

Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *