Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఒడిదుడుకులకు లోనవుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 5 శాతానికిపైగా లాభపడిన తర్వాత ఐదో సెషన్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో ప్రధాన సూచీలు ప్రారంభ లాభాలను కోల్పోయాయి.

Stock Market | నష్టాలతో ప్రారంభమై..

బుధవారం ఉదయం సెన్సెక్స్ 64 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 543 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన సూచీలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 752 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో ట్రెడింగ్ ప్రారంభించినా.. అక్కడినుంచి 136 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 250 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 76,867 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 23,792 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 15 స్టాక్స్ లాభాలతో, 15 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 3.13 శాతం, ఐటీసీ 2.80 శాతం, అదానీ పోర్ట్స్ 2.26 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.92 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.58 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టీసీఎస్ 2.56 శాతం, ఎటర్నల్ 2.03 శాతం, ఇన్ఫోసిస్ 1.86 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.63 శాతం, కొటక్ బ్యాంక్ 1.34 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Nov 04 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *