June 25 Market Analysis | కళకళలాడుతున్న ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు లాభాలతో ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 25 Market Analysis | మెగాక్యాప్ టెక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నాస్‌డాక్ (Nasdaq), ఎస్ అండ్ పీ గత సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. అయితే అమెరికాకు చెందిన చిప్‌మేకర్ మైక్రాన్ టెక్నాలజీ క్యూ2లో అంచనాలను మించిన ఆదాయాల ప్రకటన తర్వాత వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ పుంజుకున్నాయి.

దీని ప్రభావంతో గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు చాలా వరకు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల(Global markets) నుంచి అందుతున్న పాజిటివ్ సంకేతాలతో మన మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

June 25 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.43 శాతం, ఎస్ అండ్ పీ 0.10 శాతం నష్టపోగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ స్వల్ప లాభాలతో ఉంది.

June 25 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.53 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.31 శాతం లాభపడగా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.62 శాతం నష్టపోయింది.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

June 25 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 5.14 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.93 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.10 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.04 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.62 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.34 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,637 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 94.66 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.52 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.41 వద్ద ఉన్నాయి.
  • హార్ముజ్ జలసంధిలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 72.37 డాలర్ల వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *