బిజినెస్​May 11 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ క్యూస్.. నెగెటివ్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్...

May 11 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ క్యూస్.. నెగెటివ్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలునాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 11 Market Analysis | అమెరికా, ఇరాన్ (Iran)ల మధ్య శాంతి ఒప్పందం విషయమై అడుగులు ముందుకు పడకపోవడంతో మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరుగుతోంది. దీంతో మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గత సెషన్ లో వాల్ స్ట్రీట్ (Wall street)లాభాలతో ముగియగా యూరోపియన్ మార్కెట్లు నష్టపోయాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉనాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

May 11 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.71 శాతం, ఎస్ అండ్ పీ 0.84 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.30 శాతం నష్టంతో ఉంది.

May 11 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.30 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.34 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.43 శాతం క్షీణించాయి.

May 11 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 4.57 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.67 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.63 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.27 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.56 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.29 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.78 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్ఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,110 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

డీఐఐలు వరుసగా పదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,748 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.

నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.08 నుంచి 0.93 కి తగ్గింది.

విక్స్ 1,32 శాతం పెరిగి 16.84 వద్ద ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.53 డాలర్ల వద్ద ఉంది.

యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.04 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.39 వద్ద ఉన్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు బలహీనపడి 94.47 వద్ద ఉంది.

మే 14, 15 తేదీలలో బీజింగ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం ఇరు దేశాల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

మన దేశానికి సంబంధించి రిటైల్ , డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ డేటా(Inflation data) ఈ వారంలో విడుదల కానుంది. ఈ డేటా కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది.

Constable Murder Kakinada | నడిరోడ్డుపై కాపు కాసి.. గొంతు కోసి.. కానిస్టేబుల్‌ దారుణ హత్య

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Constable Murder Kakinada | నడిరోడ్డుపై కాపు కాసి.. గొంతు కోసి.. కానిస్టేబుల్‌ దారుణ హత్య

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Constable Murder Kakinada | ఆంధ్రప్రదేశ్​ AP లోని...

May 11 Horoscope | పాత బకాయిల వసూలు.. మిత్రులుగా మారే శత్రువులు.. ఈ రాశుల వారికి కలిసొచ్చిన అదృష్టం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 11 Horoscope | గ్రహ గతులను గమనిస్తే...

Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bharat Karth Accident | తెలుగు సినీ పరిశ్రమలో...