Nirmala Sitharaman PSB Reforms | బ్యాంకింగ్ రంగానికి కేంద్రం కీలక ఆదేశాలు

వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nirmala Sitharaman PSB Reforms | వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో  ( Delhi )జరిగిన ఆర్థిక సంస్థల అధిపతుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం బ్యాంకింగ్ చరిత్రలోనే ఎన్‌పీఏలు (మొండి బకాయిలు) అత్యంత కనిష్ట స్థాయికి చేరాయని తెలిపారు. గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి కోలుకున్న బ్యాలెన్స్ షీట్లను కేవలం రిస్క్ తగ్గించుకోవడానికే కాకుండా, దేశ తదుపరి దశ ఆర్థిక వృద్ధికి విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.

Nirmala Sitharaman PSB Reforms | ప్రత్యేక కమిటీ ఏర్పాటు..

వికసిత్ భారత్ 2047 దిశగా బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ కమిటీకి బ్యాంకింగ్ రంగం నుంచి అందే సూచనల ఆధారంగా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. దేశ జనాభాలో దాదాపు 29 శాతంగా ఉన్న 15 నుంచి 29 ఏళ్ల యువతకు విద్యా రుణాలు, స్టార్టప్ ఫండింగ్, , పెట్టుబడి సేవలను మరింత సులువుగా అందించాలని బ్యాంకులను ఆదేశించారు.

Nirmala Sitharaman PSB Reforms | వ్యవసాయం & డిపాజిట్లు..

కేవలం సాధారణ పంట రుణాలకే పరిమితం కాకుండా.. అగ్రికల్చర్ సెక్టార్‌లో కోల్డ్ చైన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ వంటి వాల్యూ-చెయిన్‌లకు నిధులు సమకూర్చాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. అలాగే, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిపాజిట్ల సమీకరణను పెంచుకోవాలని సూచించారు. తగిన రిస్క్ నియంత్రణలు పాటిస్తూనే క్రెడిట్ కార్డ్ సేవలను విస్తరించాలని, సరికొత్త ప్రొడక్ట్స్‌తో కస్టమర్లతో బంధాన్ని మరింత బలపరుచుకోవాలని ఆర్థిక మంత్రి హితవు పలికారు.

ఇది కూడా చదవండి:  Telangana POB Lands | పీవోబీ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం: మంత్రి పొంగులేటి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *