GITAM Admissions 2026 | గీతం వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం.. నూతన కోర్సులతో పాటు భారీ స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌లోని గీతం (GITAM) డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: GITAM Admissions 2026 | హైదరాబాద్‌లోని గీతం (GITAM) డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరంలో భాగంగా విశ్వవిద్యాలయం తన విద్యా పరిధిని విస్తరిస్తూ ‘స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ను కొత్తగా ప్రారంభించినట్లు గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు బుధవారం వెల్లడించారు.

GITAM Admissions 2026 | కొత్త కోర్సుల ప్రస్థానం..

విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యను అందించాలనే లక్ష్యంతో గీతం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వీటిలో ముఖ్యంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోర్సులు, బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ వంటివి ఉన్నాయి.

GITAM Admissions 2026 | లిబరల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకత..

గీతం హైదరాబాద్ అనుసరిస్తున్న ‘లిబరల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్’ విద్యార్థులకు ఎంతో వెసులుబాటును కల్పిస్తోంది. దీని ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన మేజర్ , మైనర్ సబ్జెక్టులను ఎంచుకుంటూ, తమ అభిరుచులకు అనుగుణంగా విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. ఇది విద్యార్థుల్లో లోతైన జ్ఞానంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన విమర్శనాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుంది.

GITAM Admissions 2026 | ప్రవేశం & స్కాలర్‌షిప్‌లు..

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు తమకు అనువైన మార్గాలను ఎంచుకోవచ్చు. విశ్వవిద్యాలయం స్వయంగా నిర్వహించే ‘గాట్-2026’ (GAT-2026) ప్రవేశ పరీక్షతో పాటు, టీజీ/ఏపీ ఈఏపీసెట్, ఎన్ సెట్, నాటా, జేఈఈ, సీయూసెట్ , క్యాట్ వంటి జాతీయ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల స్కోరు ఆధారంగా కూడా అడ్మిషన్లు పొందే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను, వారి పనితీరు ఆధారంగా ట్యూషన్ ఫీజు, వసతి , ఆహార ఖర్చులపై 100 శాతం వరకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇక, విశ్వవిద్యాలయం నిర్వహించే జాతీయ స్థాయి ‘గాట్-2026’ ఆన్‌లైన్ పరీక్ష జూన్ 28న జరగనుండగా, దానికి దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26ని చివరి తేదీగా నిర్ణయించారు. 350కి పైగా ప్రముఖ కంపెనీలతో టై-అప్ కలిగి ఉన్న గీతం, విద్యార్థులకు ఉత్తమమైన ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం www.gitam.edu వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి: Tesla Experience Center | హైదరాబాద్​లో టెస్లా ఎక్స్​పీరియన్స్​ సెంటర్​ ప్రారంభం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *