One Ride 2026 | రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘వన్ రైడ్ 2026’.. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్త మహా వేడుక

మోటార్‌సైక్లింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ వార్షిక వేడుక ‘వన్ రైడ్ 2026’ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 20, 2026) జరగనుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: One Ride 2026 | మోటార్‌సైక్లింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ( Royal Enfield ) ప్రపంచ వార్షిక వేడుక ‘వన్ రైడ్ 2026’ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 20, 2026) జరగనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లు తుది దశకు చేరుకున్నాయి. 2011 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ వేడుక.. దేశాలు, ఖండాల సరిహద్దులను చెరిపేస్తూ రైడర్లందరినీ ఒకే వేదికపైకి తెస్తోంది. ఈ ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 1,600కి పైగా ప్రాంతాల్లో ఈ రైడ్ అట్టహాసంగా సాగనుంది.

One Ride 2026  | మంచు చిరుత పరిరక్షణకు..

“ప్రతి రైడర్. ప్రతి రహదారి. ఒకే లక్ష్యం.” అనే నినాదంతో సాగే ‘వన్ రైడ్ 2026’ను ఈసారి హిమాలయాల ప్రత్యేక చిహ్నమైన ‘మంచు చిరుత’ (స్నో లెపర్డ్) సంరక్షణకు అంకితం చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు హిమాలయాలు ఆధ్యాత్మిక నిలయం లాంటివి. ఈ నేపథ్యంలో.. ఈ రైడ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి తరఫున మంచు చిరుత పరిరక్షణకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకంగా విరాళం అందజేయనుంది.

One Ride 2026  | పనులు జోరుగా..

రాయల్ ఎన్‌ఫీల్డ్ సోషల్ మిషన్ ద్వారా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ( , లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మంచు చిరుత ఆవాసాలను పరిరక్షించే పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో సుమారు 718 మంచు చిరుతలు ఉన్నట్లు అంచనా. ఈ గ్లోబల్ రైడ్‌లో భాగంగా ఢిల్లీ, లండన్, సావో పాలో వంటి ఏ దేశం నుంచి రైడర్లు పాల్గొన్నా.. ఆయా ప్రయత్నాలు హిమాలయాల్లోని వన్యప్రాణి సంరక్షణకు నేరుగా సహకరించినట్లవుతుంది.

One Ride 2026  | రిజిస్ట్రేషన్లకు ఆఖరి అవకాశం..

సెప్టెంబర్ 20న జరిగే ఈ మహా ప్రయాణంలో పాలుపంచుకోవాలనుకునే రైడర్లు అధికారిక వెబ్‌సైట్ (https://royalenfield.com/oneride) ద్వారా లేదా సమీపంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ను సంప్రదించి వెంటనే పేర్లు నమోదు చేసుకోవచ్చు. స్వతంత్ర రైడర్లు, రైడింగ్ క్లబ్‌లు కూడా సొంతంగా రైడ్‌లను ప్లాన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంకా రిజిస్టర్ చేసుకోని వారు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Education | నాణ్యమైన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *