అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi MACT Compensation | ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 88 శాతం శాశ్వత వైకల్యానికి గురైన 32 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నీలమణి చౌహాన్‌కు రూ. 2.92 కోట్ల భారీ పరిహారాన్ని మంజూరు చేస్తూ ఢిల్లీ మోటారు ప్రమాద క్లెయిమ్‌ల ట్రిబ్యునల్ (MACT) కీలక తీర్పునిచ్చింది. 2020 డిసెంబర్ 30న అతివేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన కారు నీలమణి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వెన్నుకు తీవ్ర గాయమై నడుము కింద భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. జీవితాంతం లేచి నిలబడలేని, నడవలేని స్థితికి చేరుకోవడంతో పాటు ప్రతి పనికీ అటెండెంట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పిటిషన్‌ను విచారించిన పీవో అభిలాష్ మల్హోత్రా ధర్మాసనం.. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారిస్తూ, బాధితుడికి వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.
Delhi MACT Compensation |తోసిపుచ్చిన ట్రిబ్యునల్..
విచారణ సందర్భంగా బాధితుడు ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించలేదని, అందువల్ల పరిహారంలో కోత విధించాలని బీమా సంస్థ చేసిన వాదనను ట్రిబ్యునల్ తీవ్రంగా తోసిపుచ్చింది. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినంత మాత్రాన అదే ప్రమాదానికి దారితీసిందని చెప్పలేమని, తగిన ఆధారాలు లేకుండా దానిని ‘కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్’గా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ఇది నకిలీ ప్రమాదమని ఆలస్యంగా లేవనెత్తిన వాదనలను కూడా కొట్టిపారేసింది.
Delhi MACT Compensation |భారీ పరిహారం ..
మార్కెటింగ్ రంగంలో ఉండే వ్యక్తి కదలికలు లేకుండా కేవలం డెస్క్ జాబ్‌కే పరిమితం కావడం, సంపాదన సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని ట్రిబ్యునల్ (Tribunal ) పరిగణనలోకి తీసుకుంది. భవిష్యత్ జీవనోపాధి నష్టం, వైద్య ఖర్చులు, అటెండెంట్ భత్యం తదితర అంశాల కింద ఈ భారీ పరిహారాన్ని ఖరారు చేసింది.
ఇది కూడా చదవండి: Vimal Ad Controversy | విమల్ యాడ్ ఎఫెక్ట్.. షారుఖ్ ఖాన్‌కు నోటీసులు