Vimal Ad Controversy | విమల్​ యాడ్​ ఎఫెక్ట్​.. షారుఖ్​ ఖాన్​కు నోటీసులు

విమల్​ యాడ్​లో నటించినందుకు బాలీవుడ్​ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vimal Ad Controversy | మహారాష్ట్రలోని రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాను ఒక ప్రకటన ద్వారా పరోక్షంగా ప్రచారం చేసినందుకు నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (FDA) నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.

షారుఖ్​ ఖాన్​తో పాటు అజయ్​ దేవ్​గన్ (Ajay Devgan)​, టైగర్​ ష్రాఫ్​ 2024లో విమల్ అనే పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకులను ప్రచారం చేశారు. దీనిపై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. విమల్​ పాన్​మసాలను పరోక్షంగా వారు ప్రచారం చేశారు. దీనిపై ఇటీవల మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాం ముండే నోటీసులు ఇచ్చారు. వెంటనే యాడ్​ను నిలిపి వేయాలని, ఆ ప్రకటనకు సంబంధించిన అన్ని ప్రచార కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించారు.

Vimal Ad Controversy | జరిమానా విధించే ఛాన్స్​

సదరు ప్రకటనను పరిశీలించగా, అది విమల్ బ్రాండ్‌ను ప్రచారం చేస్తున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని తుకారాం ముండే అన్నారు. ఈ బ్రాండ్ ప్రధానంగా పాన్ మసాలాతో ముడిపడి ఉందని తెలిపారు. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలను నిషేధించినట్లు గుర్తు చేశారు. సదరు యాడ్​వినియోగదారులను తప్పుదోవ పట్టించవచ్చని, నిషేధిత ఉత్పత్తి బ్రాండ్ గుర్తింపును పరోక్షంగా ప్రోత్సహించవచ్చని నోటీసులో పేర్కొన్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టాల ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రచారాలకు రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానాలు విధించవచ్చు. ప్రచారం చేసేవారిని మూడు సంవత్సరాల వరకు ఏ ఉత్పత్తులను ప్రచారం చేయకుండా నిషేధించవచ్చు. విమల్​ యాడ్​పై విమర్శలు రావడంతో గతంలో అక్షయ్​ కుమార్​ క్షమాపణలు చెప్పారు. దాని నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

దీనిని కూడా చదవండి : Suryapet Bus Accident | రెండు బస్సులు ఢీ.. సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *