అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Sanjay KTR | బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు తెలంగాణను పాలించి, అధికారం కోల్పోయిన తర్వాత భారతదేశంలో మంచి కళాశాలలు లేవు అంటున్నారని విమర్శించారు.
కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో మట్లాడుతూ.. దేశంలో మంచి కాలేజీలు లేవన్నారు. దీంతో తన కూతురు అమెరికాలో చదువుకోడానికి వెళ్తోందని చెప్పారు. అనేక మంది విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు, కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆత్మహత్యలకు ఎవరు పురికొల్పారని, తగినంత మంది ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదన్నారు.
Bandi Sanjay KTR | నిధులు ఇవ్వలేదు
బీఆర్ఎస్ హయాంలో కళాశాలలకు నిధులు ఇవ్వకుండా చేశారన్నారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా సకాలంలో చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్. పాలన రిపోర్ట్ కార్డ్ ఇప్పుడు కేసీఆర్ (KCR) సొంత ఇంటి నుంచే వస్తోందన్నారు. మొదట ఆయన మనవడు పాఠశాలలు బాగోలేవని అన్నారని, ఇప్పుడు ఆయన మనవరాలు కళాశాలలు అంత మంచిగా లేవని అంటోందన్నారు. ‘‘పదేళ్లు అధికారంలో ఉండి, మీరు సరిచేయడంలో విఫలమైన వాటిని మీ సొంత పిల్లలే ఎత్తి చూపుతున్నారు” అని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు కాలేజీల్లో ఏం చేస్తున్నారోనని అతిగా ఆలోచించడం, తమ ఫోన్లను ట్యాప్ చేయడం మానేసి, వారి సొంత పిల్లల మాట వినాల్సిందని హితవు పలికారు.
ఇది కూడా చదవండి : Weather Update | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన