తెలంగాణMP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​పై కాంగ్రెస్​ ఎంపీ అనిల్​ కుమార్​ యాదవ్ విమర్శలు చేశారు. ఆయనకు వడదెబ్బ తగిలి మాట్లాడుతున్నారని అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP Arvind)పై కాంగ్రెస్​ ఎంపీ అనిల్​ కుమార్​ యాదవ్ విమర్శలు చేశారు. అర్వింద్​ తలపై వెంట్రుకలు లేవని, ఎండలో తిరగడంతో ఆయన గుండుకు వడదెబ్బ తాకినట్లునందని ఎద్దేవా చేశారు.

అర్వింద్​ ఇటీవల నిజామాబాద్​ (Nizamabad)లో మట్లాడుతూ.. సీఎంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్​రెడ్డి (Revanth Reddy)కి ప్రధాని మోదీతో లింక్​లు ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఎంపీ అనిల్​ కుమార్​ మాట్లాడుతూ.. ధర్మపురి అర్వింద్ నెత్తిపై వెంట్రుకలు లేక గుండు తో ఉన్నాడన్నారు. హీట్​వేవ్​లో ఎక్కడ తిరిగి వచ్చాడో తెలియదు కానీ, వచ్చి ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని అన్నారు.

MP Anil kumar | మంత్రి అడ్లూరి ఫైర్

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అర్వింద్​ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే.. బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

MP Anil kumar | అద్దంకి ఆగ్రహం

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్​ అద్దంకి దయాకర్​ సైతం ధర్మపురి అర్వింద్​ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ అన్ని చోట్ల ఒరిజిన‌ల్ బీజేపీ వాళ్ల‌కే ప‌దవులు ఇచ్చిందా అని ప్రశ్నించారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి, అస్సాం సీఎం హేమంత బిశ్వా ఏ పార్టీ నుంచి వచ్చారన్నారు. డీఎస్​ లేకపోతే అర్వింద్​ బతుకు ఎక్కడ అన్నారు.

దీనిని కూడా చదవండి: Dharmapuri Arvind|జగిత్యాల బీజేపీ సీనియర్లపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

Kamareddy Water Supply | నీటి సమస్య తీర్చిన ఘనత షబ్బీర్ అలీదే..: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Water Supply |కామారెడ్డిలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి...

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...