Pawan Kalyan Farmhouse | యూట్యూబ్ బ్లాక్‌మెయిల్ దందా.. పవన్ ఆస్తిపై తప్పుడు మ్యాప్‌లతో దుష్ప్రచారం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Farmhouse | డిజిటల్ జర్నలిజం ముసుగులో కొందరు యూట్యూబర్లు సమాంతర న్యాయస్థానాలు నడుపుతూ బ్లాక్‌మెయిల్ దందాలకు తెరలేపుతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, మైక్ పట్టుకుని తామే స్వయంగా అధికారులుగా, జడ్జీలుగా అవతారమెత్తి ప్రైవేట్ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. వివాదాస్పద భూములే లక్ష్యంగా ఫీల్డ్‌లోకి వెళ్లి రచ్చ చేయడం, యజమానులను భయపెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేయడం ఇప్పుడు ఒక పెద్ద ల్యాండ్ మాఫియాగా మారింది. సామాన్యులు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసిన ఈ ముఠాలు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తిని లక్ష్యంగా చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

Pawan Kalyan Farmhouse | పొలిటికల్ స్కెచ్‌తోనే ..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలో పవన్ కళ్యాణ్‌కు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఒక ఫామ్‌హౌస్ ఉంది. తన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఆయన దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించారు. అయితే, గత కొన్ని రోజులుగా కొందరు యూట్యూబర్లు, కొన్ని డిజిటల్ ఛానళ్ల ప్రతినిధులు ఒక పక్కా పొలిటికల్ స్కెచ్‌లో భాగంగా ఈ ప్రాపర్టీపై పడ్డారు. అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లడం నేరమని తెలిసి కూడా.. కెమెరాలతో లోపలికి వెళ్ళి నానా హంగామా సృష్టించారు. అది ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఉందంటూ, శిఖం (జలాశయంగరిష్ట నీటి మట్టం పరిధిని) భూమిని కబ్జా చేశారంటూ తప్పుడు డాక్యుమెంట్లు, మార్ఫింగ్ మ్యాప్‌లతో దుష్ప్రచారం చేశారు.

houses

Pawan Kalyan Farmhouse | అధికారుల పనిని చేతుల్లోకి తీసుకుంటే ఎలా?

నిజానికి ఒకవేళ సదరు ఆస్తిలో ఏవైనా చట్టపరమైన లోపాలు ఉంటే, వాటిని నిరూపించాల్సింది , చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ, హైడ్రా (HYDRAA) లేదా స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రమే. అంతే తప్ప, ప్రైవేటు వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, సరిహద్దు గోడలు దాటి లోపలికి వెళ్లి యజమానులను, అక్కడ పనిచేసే సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. ఈ యూట్యూబ్ బ్యాచ్ ఉద్దేశం నిజంగా అక్రమాలను ప్రశ్నించడం కాదు.. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర నాయకుడి పేరు వాడుకుని బ్లాక్‌మెయిల్ దందాలకు తెరతీయడమేనని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో సదరు ఫామ్‌హౌస్ యాజమాన్యం , లీగల్ టీమ్ ఇప్పటికే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.
pawan.1

 

Pawan Kalyan Farmhouse | డిజిటల్ దోపిడీపై కఠిన చర్యలు అవసరం..

కబ్జా పేరుతో బడా బాబుల ప్రాపర్టీల వద్దకు వెళ్లి వీడియోగ్రఫీ చేయడం, తెరవెనుక సెటిల్‌మెంట్లు కుదరకపోతే వాటిని సోషల్ మీడియాలో పెట్టి సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇటువంటి డిజిటల్ బ్లాక్‌మెయిలర్లపై తెలంగాణ పోలీస్ శాఖ కఠినమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని క్రిమినల్ ట్రెస్పాస్, ఎక్స్‌టార్షన్, సైబర్ క్రైమ్ సెక్షన్ల కింద వీరిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపితేనే.. భవిష్యత్తులో సామాన్య పౌరుల ఆస్తులకు, ప్రైవసీకి పూర్తి రక్షణ లభిస్తుంది.

 

ఇది కూడా చదవండి:  Telangana Development | అభివృద్ధి పథంలో తెలంగాణ : సుదర్శన్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *