Mahesh Kumar Goud | పవన్ కళ్యాణ్‌పై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahesh Kumar Goud | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తాము కేవలం ఒక సినిమా నటుడిగానే చూస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

pcc.2 2

Mahesh Kumar Goud | ఆంధ్రా నేతకు ఆంధ్రాపైనే ప్రేమ..

ప్రాంతీయ సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తూ మహేశ్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. “ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకుడికి ఎప్పుడైనా సరే ఆంధ్రా ప్రాంతం మీదనే ప్రేమ ఉంటుంది. అలాంటి వారు తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారు?” అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి స్థానం లేదనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు.

pcc.2 1

Mahesh Kumar Goud | రాజకీయాలు వేరు

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామితో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధంపై కూడా పీసీసీ చీఫ్ స్పందించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి అందరికీ ఆరాధ్య దైవమని, అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కు కూడా కొండగట్టు అంజన్న ఇష్ట దైవమని పేర్కొన్నారు. దేవుడిని దర్శించుకోవడం వేరని, ఇక్కడ రాజకీయాలు చేయడం వేరని పేర్కొంటూ.. ఆధ్యాత్మికతను, రాజకీయాలను ముడిపెట్టలేమని అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: Cooler Electric Shock | ప్రాణం తీసిన కూలర్​.. తండ్రీకొడుకుల మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *