Cooler Electric Shock | ప్రాణం తీసిన కూలర్​.. తండ్రీకొడుకుల మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cooler Electric Shock | ఇనుప కూలర్​ రెండు ప్రాణాలను బలి తీసుకుంది. నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్​ కొట్టి తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా (Nirmal District)లో చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. కూలర్​, ఫ్యాన్​ లేకపోతే ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు కూలర్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప కూలర్​ ఓ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చల్లగాలి కోసం కూలర్​లో నీళ్లు పోస్తున్న మహిళకు కరెంట్ షాక్​ కొట్టింది. ఆమెను కాపాడబోయిన భర్త, వారిద్దరిని రక్షించడానికి వెళ్లిన కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటనటలో తండ్రీకొడుకులు మృతి చెందాగా.. మహిళ తీవ్ర గ్రాయాలతో బయట పడింది. ఈ ఘటన నిర్మల్​ జిల్లా పెంబి మండలం (Pembi Mandal) కొరకంటితండాలో చోటు చేసుకుంది.

Cooler Electric Shock | కాపాడబోయి..

Cooler Electric Shock

తండాకు చెందిన రాథోడ్‌ అర్జున్‌(56) భార్య సోనాబాయి దంపతులకు కుమారులు శ్రీనివాస్‌(25), సుభాష్‌ ఉన్నారు. ఆదివారం రాత్రి సోనాబాయి ఇంట్లో ఉన్న ఇనుప కూలర్‌లో నీళ్లు పోయడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు కరెంట్​ షాక్​ కొట్టింది. ఆమె కేకలు వేయడంతో భర్త అర్జున్​ వచ్చి పక్కకు నెట్టేశాడు. ఆమె పక్కకు పడిపోయినా.. కూలర్‌ (Cooler) కిందపడి దాంట్లోని నీరు నేలపై పడ్డాయి. దీంతో అర్జున్​కు కరెంట్​ షాక్​ తగిలింది. కళ్ల ముందే తల్లిదండ్రులు విద్యుత్​ షాక్​కు గురి కావడంతో పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ కాపాడటానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి షాక్​ కొట్టింది. దీంతో అర్జున్​, శ్రీనివాస్​ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనాబాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Cooler Electric Shock | జాగ్రత్తగా ఉండాలి

ఇనుప కూలర్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎక్కడైన వైరు తేలిన కూలర్​ మొత్తం షాక్​ కొడుతుంది. సీజన్​ ప్రారంభంలోనే మెకానిక్​ దగ్గరకు తీసుకెళ్లి వైరింగ్​ చెక్​ చేయించుకోవాలి. కూలర్​ లోపల విద్యుత్ వైర్లకు అతుకులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఆఫ్​ చేసిన తర్వాతే నీళ్లు పోయాలి. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఇనుప కూలర్ల దగ్గరకు వెళ్లనీయొద్దు. కూలర్​కు ఎర్తింగ్​ వచ్చినా.. విద్యుత్​ షాక్​ వస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా మరమ్మతులు చేయించాలి.

ఇది కూడా చదవండి..: Telangana Formation Day | అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలు : వి.హన్మంత్ రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *