Telangana Heat Wave | భానుడి భగభగలు.. పెరగనున్న ఎండ తీవ్రత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రెండు రోజుల పాటు అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో వాతావరణం కాస్తా చల్లబడింది. అయితే నేటి నుంచి ఎండలు మరింత ముదురనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో గురువారం హీట్​వేవ్​ కొనసాగనుందని అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్ (Nizamabad)​, ఉమ్మడి వరంగల్​, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. గాలులు తక్కువగా వీస్తాయి. దీంతో ఉక్కపోత అధికంగా ఉంటుంది. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పలుచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Telangana Heat Wave | బయటకు వెళ్లొద్దు

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి. తలకు ఎండతగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Telangana Heat Wave | వర్ష సూచన

అధిక వేడి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్​కర్నూల్​, వనపర్తి, గద్వాల్, మహబూబ్​నగర్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం, రాత్రి పూట ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పడే ఛాన్స్​ ఉంది.

ఇది కూడా చదవండి..: Kurchi Tatha Death | ‘ఆ కుర్చీని మడత పెట్టి’ ఫేమ్ కుర్చీ తాత కన్నుమూత.. భార్య ఒడిలో తుది శ్వాస విడిచిన అహ్మద్ పాషా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *