అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Allegations | సొంత పార్టీ వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అవినీతిపై మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. అందుకే మీనాక్షిపై పగపట్టి, దొంగ కేసు పెట్టించారని ఆరోపించారు. మీనాక్షి మధ్యప్రదేశ్‌లో నామినేషన్ వేస్తే, బీజేపీ వాళ్లకు కేసు విషయం చెప్పారన్నారు. మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా చేశారని ఆరోపించారు.
KTR Allegations | అట్టర్ ప్లాఫ్
కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా అని కేటీఆర్ అన్నారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు మిగిలిండ్ ఏండ్ కార్డే అన్నారు. అడ్డగోలుగా హమీలిచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తోందన్నారు.
KTR Allegations | పగబట్టిన సీఎం
కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి అన్నారు. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అయిన ఆమెపై రేవంత్‌రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి చెప్పడంతో ఆమెపై పగపట్టారన్నారు.
KTR Allegations | నిరుద్యోగ భృతి ఎక్కడ
మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేల భృతి ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లు కూడా కట్టని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు..
“రేవంత్ రెడ్డి మంచోడు కాదని మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి చెప్పింది. అందుకే ఆమె మీద కేసు నమోదు చేయించి, ఆ తర్వాత్ కేసు గురించి బీజేపీ వాళ్లకి చెప్పించాడు. రాజ్యసభ నామినేషన్ కాన్సిల్ అయ్యేలా చేశాడు. సొంత నాయకులనే వెన్నుపోటు పొడిచినోడు.. తెలంగాణను ఎట్ల… pic.twitter.com/p8OIDN4Jvr
— Akshara Today | Telugu News (@aksharatoday) June 14, 2026
దీనిని కూడా చదవండి : Software Engineer Death | యాదాద్రి జిల్లాలో విషాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి