Andhra Liquor Scam | తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు

ఏపీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Andhra Liquor Scam | తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) చేపట్టింది. ఏపీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఏపీలో వైసీపీ హయాంలో లిక్కర్​ స్కామ్​ (Liquor Scam) జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్​ అయ్యారు. ఇందులో భాగంగా ఈడీ అధికారులు గతంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. తాజాగా హైదరాబాద్​ (Hyderabad)నగరంలోని 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది.

Andhra Liquor Scam | రాజ్​ కేసిరెడ్డి ఇళ్లలో

లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. గతంలో ఆయన ఫామ్​ హౌజ్​లో భారీగా నగదు లభ్యం అయిన విషయం తెలిసిందే. రాజ్ కేసిరెడ్డితో పాటు మరో ఆరుగురు నిందితుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కాంలో రూ.వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టింది.

ఇది కూడా చదవండి..: Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్

 

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *