అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Houses | నగరంలోని అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం కొత్త విడతను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , అజారుద్దీన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, దీనికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.
Indiramma Houses | పథకం ఉద్దేశం..
ఈ ప్రాజెక్టులో భాగంగా, ప్రభుత్వం సేకరించిన భూములలో హౌసింగ్ బోర్డు ద్వారా అత్యాధునిక 10 అంతస్తుల టవర్లను నిర్మించనున్నారు. ప్రతి అంతస్తులో 12 ఫ్లాట్ల చొప్పున, మొత్తం జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ , మల్కాజిగిరి పరిధిలో లక్ష ఫ్లాట్లను అందుబాటులోకి తేవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. చార్మినార్, బహదూర్ పురా , ముషీరాబాద్ నియోజకవర్గాలు మినహా, క్యూర్ పరిధిలోని మిగిలిన 26 నియోజకవర్గాల్లో ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున, మొత్తం 8,000 ఇళ్లను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Indiramma Houses | అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ..
లబ్ధిదారుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించకూడదు. వారికి సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. రేపటి (జులై 21)నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎల్‌ఐజీ ఫ్లాట్ల కోసం రూ. 100 దరఖాస్తు ఫీజు, రూ. 10 వేల ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ కేటాయించని పక్షంలో ఈఎండీ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.
Indiramma Houses |ప్రభుత్వం ముందు చూపు..
పథకం ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గతం ప్రభుత్వాలు పేదలకు నగరానికి 30 కి.మీ దూరంలో ఇళ్లు ఇవ్వడం వల్ల వారు నివాసం ఉండలేకపోయారని విమర్శించారు. తాము మాత్రం లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరలోనే ఇళ్లను నిర్మించి, వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గజం భూమి ధర లక్షల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా పేదలకు సొంత ఇళ్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Telangana government has launched the scheme for construction of Indiramma Houses in Hyderabad, Core Urban Region (CURE), on Monday (July 20, 2026). The houses would be built in high rise buildings.https://t.co/F40wplPeYf pic.twitter.com/2pXNtRrvcS
— The Hindu (@the_hindu) July 20, 2026
ఇది కూడా చదవండి: Tripura DGP Death | త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ అనుమానాస్పద మృతి