Tripura DGP Death | త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ అనుమానాస్పద మృతి

త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధంకర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tripura DGP Death | త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధంకర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం . సోమవారం ఉదయం ఆయన మృతదేహాన్ని అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. ఈ అకస్మిక మరణం త్రిపుర పోలీస్ శాఖలో, రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

Tripura DGP Death | ఘటన వివరాలు..

1994 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ ధంకర్, గత సంవత్సరం మే నెలలో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విషాద ఘటనపై త్వరలోనే ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి:  NEET Protest | రాజ్యసభలో గందరగోళం.. మధ్యాహ్నం వరకు సభ వాయిదా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *