అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Protest | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ , విద్యావ్యవస్థలోని లోపాలపై నిరసనగా, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం తీవ్ర ఘర్షణకు దారితీసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు చేపట్టిన ఈ మార్చ్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి వేడెక్కింది.
NEET Protest | పోలీసుల లాఠీఛార్జ్..
నిరసన ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, సీజేపీ మద్దతుదారులు భారీగా జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లను దాటుకుని పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో పాటు తోపులాట జరిగింది. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలతో లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
NEET Protest | రాజ్యసభలో ప్రకంపనలు..
ఈ పరిణామాల ప్రభావం పార్లమెంట్ లోపల కూడా స్పష్టంగా కనిపించింది. నిరసనకారులపై ప్రభుత్వం బలగాలను ప్రయోగించిందని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ( Mallikarjun Kharge ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ , సీబీఎస్ఈ లోపాలపై సభలో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణ అందుకు అనుమతినివ్వకపోవడంతో, ‘ఇండియా’ కూటమి సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. గందరగోళం కొనసాగుతుండటంతో, స్పీకర్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Kamareddy Theft | కామారెడ్డిలో దొంగల హల్చల్.. విద్యుత్ ఉద్యోగి ఇంట్లో చోరీ