Kamareddy Theft | కామారెడ్డిలో దొంగల హల్​చల్​.. విద్యుత్​ ఉద్యోగి ఇంట్లో చోరీ

కామారెడ్డి పట్టణంలో ఓ విద్యుత్​ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft | పోలీసులు నిఘా పెడుతున్నప్పటికి చోరీలు ఆగడం లేదు. దొంగలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

Kamareddy Theft | దేవునిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో..

తాజాగా దేవునిపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో ఓ విద్యుత్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal)లో ఏఈగా పనిచేస్తున్న గంగాధర్ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం సదరు ఉద్యోగి కుటుంబంతో కలిసి గంభీరావుపేటలో బంధువుల ఇంట్లో ఫంక్షన్​కు వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటితాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని బీరువాలో ఉంచిన 3 తులాల బంగారు గొలుసు, 20 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు క్లూస్​టీం ద్వారా వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: PCC Chief Visit | ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్​ ప్రత్యక పూజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *