అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Paper Leak Protest | నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా సమాజ్‌వాది పార్టీ ఎంపీలు సోమవారం నిరసన తెలిపారు. పార్లమెంట్ నుంచి జంతర్‌మంతర్ వరకు పాదయాత్ర చేశారు.
ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం కాదు, ‘అహంకారం’ అన్నారు. పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎవరు సంతాపం తెలపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ డింపుల్ యాదవ్ (MP Dimple Yadav) మాట్లాడుతూ.. యువత తమ ఆందోళనలను వినిపించాలనుకుంటున్నారు, కానీ ప్రభుత్వం వినడానికి, చర్చలకు నిరాకరిస్తోందన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ కూడా చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం చాలా కఠినంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇతరుల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
NEET Paper Leak Protest | విద్యార్థులకు అండగా నిలుస్తాం
తాము విద్యార్థులకు అండగా నిలుస్తామని డింపుల్ యాదవ్ తెలిపారు. విద్యార్థులు నిష్పక్షపాత పరీక్షలను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంపీ ఇక్ర హసన్ మాట్లాడుతూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తోందని విమర్శించారు. విశ్వవిద్యాలయాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పత్రాల నుండి ఆలయ నిధుల వరకు ప్రతిదీ దొంగిలించే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.
ఇది కూడా చదవండి..: NEET Protest | రాజ్యసభలో గందరగోళం.. మధ్యాహ్నం వరకు సభ వాయిదా