అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cylinders Floating | మహారాష్ట్ర (Maharashtra)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రాయఘడ్ ప్రాంతంలోని పాతాళగంగ వద్ద ఉన్న HPCL బాట్లింగ్ ప్లాంట్‌లోకి వరద నీరు రావడంతో ప్రహరీ కూలిపోయింది. దీంతో 3 వేల సిలిండర్లు కొట్టుకుపోయాయి.
Cylinders Floating | రక్షణ గోడ కూలిపోవడంతో
భారీ వర్షాల కారణంగా ప్లాంట్ రక్షణ గోడ కూలిపోవడంతో వరద నీరు నేరుగా ప్రాంగణంలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. దీనివల్ల సిలిండర్లు కొట్టుకుపోయి పాతాళగంగ నది, ఖార్పడా క్రీక్ (వాగు)లో పడ్డాయి. తేలుతున్న సిలిండర్లను చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు, వంతెన పైనుండి వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రజలు సిలిండర్లను పట్టుకొని తీసుకెళ్లారు. నదిలోకి కొట్టుకుపోయిన సిలిండర్లలో కొన్ని గ్యాస్‌తో నిండి ఉండవచ్చని యంత్రాంగం పేర్కొంది.
Cylinders Floating | అధికారులకు అప్పగించాలి
నదిలో, సమీప ప్రాంతాల్లో తేలుతున్న ఈ గ్యాస్ సిలిండర్లు ఎవరికైనా కనిపిస్తే, వాటిని వెంటనే సంబంధిత అధికారులకు లేదా కంపెనీకి అప్పగించాలని రాయ్‌గఢ్ కలెక్టర్ కిషన్ జవ్లే ప్రజలకు కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా, ప్రజలు ఈ సిలిండర్లను తమ ఇళ్లలో ఉంచుకోవద్దని, వీలైనంత త్వరగా వాటిని యంత్రాంగానికి లేదా కంపెనీకి అప్పగించడంలో సహకరించాలన్నారు. నదిలోకి కొట్టుకుపోయిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో లేదా అవి సురక్షితమైన స్థితిలో ఉన్నాయో లేదో చెప్పలేమన్నారు. కుతూహలంతో, వినియోగం కోసం వాటిని పట్టుకొని తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరం అన్నారు.
వరద బీభత్సం.. కొట్టుకుపోయిన సిలిండర్లు..
మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి హెచ్‌పీసీఎల్ పాతాళగంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ముంపునకు గురైంది. దీంతో అందులోని సుమారు 3,000 సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి.#Maharashtra #Floods… pic.twitter.com/K3YQwyXUZo
— Akshara Today | Telugu News (@aksharatoday) July 9, 2026
ఇది కూడా చదవండి..: Train Honeymoon Setup | కొత్తజంట కోసం ట్రైన్లో హనీమూన్ సెటప్.. రైల్వే శాఖ ఆగ్రహం