అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Influencer Arrested | త్రిపురకు చెందిన ఒక యువకుడిని జాతి వివక్షతో కూడిన దూషణలకు, అవమానాలకు గురిచేసిన ఢిల్లీకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ను పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటగా కేసు నమోదు చేశారు.
కంటెంట్ క్రియేటర్‌ను అమీర్ షోకీన్‌గా గుర్తించారు. సదర్ బజార్ ప్రాంతంలో ఉంటే అతడు గతంలో సైతం పలు గొడవల్లో పాల్గొన్నాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) నిహారిక భట్ తెలిపారు. ఈ వీడియో మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం షోకీన్ నివాసానికి వెళ్లగా, అతను అక్కడ లేడు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆ కంటెంట్ క్రియేటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Influencer Arrested | త్రిపుర పోలీసులకు..
త్రిపుర పోలీసులు ఢిల్లీకి చేరుకొని నిందితుడు షోకీన్‌ను (Influencer Arrested ) తమ అదుపులోకి తీసుకుంటారు. అనంతరం పోలీసులు షోకీన్‌ను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ కోరతారు. సుమారు నెల రోజుల క్రితం అహ్మదాబాద్‌లో షోకీన్ ఈ వివాదాస్పద వీడియోను రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏడు నుంచి ఎనిమిది మంది నిందితులు ఉన్నారని, వారి పాత్రపై దర్యాప్తు జరుగుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి.
Amir Shokeen is a Delhi street-comedy creator from Sadar Bazar. Arrested after a viral video of him racially abusing a Tripura youth. Family cut ties years ago; brothers call him a miscreant with prior criminal cases. https://t.co/FoAVEqxckw
— YSS Group (@yss_group) October 22, 2026
దీనిని కూడా చదవండి : France Riots | ఫ్రాన్స్‌లోని అల్లర్లకు, భారత్‌లో నిరసనలకు మధ్య సంబంధం!