pm modi | అరాచక రాజకీయాలపై నిప్పులు చెరిగిన ప్రధాని.. ప్రత్యర్థులపై మోడీ పూర్తిగా అటాక్​ మోడ్​!

అరాచక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్న వారి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని Modi హెచ్చరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: pm modi | స్వార్థ రాజకీయాల కోసం దేశంలో అరాచకం సృష్టించాలని చూసే శక్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ఆశయాలు ఎప్పటికీ దేశ స్థిరత్వానికి, జాతీయ భద్రతకు అడ్డుకాకూడదని ఆయన స్పష్టం చేశారు.

pm modi | అరాచక శక్తులపై ఉక్కుపాదం

దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, తమ స్వార్థ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే ప్రత్యర్థులపై ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయి అటాక్ మోడ్‌లోకి వెళ్లారు. దేశంలో కావాలనే అశాంతిని, అరాచక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్న వారి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

pm modi | జాతీయ స్థిరత్వమే ప్రథమ ప్రాధాన్యం

ఎన్నికల లబ్ధి కోసం, వ్యక్తిగత రాజకీయ ఆశయాల కోసం దేశ ఐక్యతను, స్థిరత్వాన్ని దెబ్బతీసే చర్యలను ఎవరూ సమర్థించలేరని మోడీ తేల్చిచెప్పారు. దేశం కంటే ఏ రాజకీయ పార్టీ, వ్యక్తిగత ఎజెండా గొప్పది కాదని స్పష్టం చేశారు. జాతీయ భద్రత, స్థిరత్వమే మనందరి ప్రథమ ప్రాధాన్యం కావాలని ఆయన పునరుద్ఘాటించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ప్రస్తుతం ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *