అక్షరటుడే వెబ్‌డెస్క: Chandipura Virus | గుజరాత్ రాష్ట్రంలో చండీపురా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 35 మందికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాల్లో క్రిమిసంహారక మందులను పిచికారి చేస్తున్నారు.
Chandipura Virus | ఎలా వ్యాపిస్తుంది?
15 సంవత్సరాల లోపు చిన్నారులపై ప్రధానంగా ప్రభావం చూపే ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షనే ‘చండీపురా వైరస్’. ఇది శాండ్ ఫ్లై (ఇసుక ఈగలు) అనే కీటకాల ద్వారా, అలాగే మురికి కాలువల్లో ఉండే దోమలు, నల్లుల కాటు వల్ల వ్యాపిస్తుంది. అయితే, ఇది ఒక మనిషి నుంచి మరో మనిషికి నేరుగా సోకదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Chandipura Virus | తీవ్రమైన లక్షణాలు..
ఈ వైరస్ సోకిన చిన్నారులకు తీవ్రమైన మెదడువాపు (ఎన్సెఫాలిటిస్) వస్తుంది. దీని లక్షణాలు చాలా వేగంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కేవలం 48 గంటల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్చ రావడం, మెదడు కణజాలంలో వాపు, కోమాలోకి వెళ్లడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి యాంటివైరల్ మందులు అందుబాటులో లేవు. అయితే, వైరస్ సోకిన వెంటనే బాధితులకు ఐసీయూలో అత్యవసర వైద్యం అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Children mostly below 15 years of age have contracted Chandipura virus in Gujarat, with twenty-two children succumbing to the infection, while seven others are currently undergoing treatment.
Read here :https://t.co/U4CmCxlhy7#DNAUpdates | #Gujrat | #ChnadiPuraVirus | #CHPV pic.twitter.com/zhE6LrPjXS
— DNA (@dna) August 4, 2026
ఇది కూడా చదవండి: Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద