Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Project Flood | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది.కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ జలాశయాలకు భారీగా వరద వస్తోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఆల్మట్టికి 1,40,257 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1,49,597 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 111 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్​ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో జూరాలకు భారీగా ఇన్​ఫ్లో నమోదు అవుతోంది.

Srisailam Project Flood | 27 గేట్లు ఎత్తివేత

గద్వాల జిల్లా (Gadwal District)లోని జూరాల ప్రాజెక్ట్​కు 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. అధికారులు 27 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు ఉంది. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్ల లో434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తం 2.21 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Srisailam Project Flood | 100 టీఎంసీలు దాటిన శ్రీశైలం

జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. 2,16,762 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్ట్ నీటిమట్టం 857.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలు దాటింది. వరద ఇలాగే కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Telangana Flagship Programmes | ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల అమలులో శాఖల సమన్వయం కీలకం : ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *