అక్షరటుడే, వెబ్డెస్క్: Germany Job Opportunities | జర్మన్ భాష నేర్చుకోవడంలో క్రమశిక్షణ, నిరంతర సాధనే విజయానికి మార్గమని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) పేర్కొన్నారు. విదేశీ భాషల్లో ప్రావీణ్యం సాధించడం ద్వారా యువత అంతర్జాతీయ స్థాయిలో లభించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.
హైదరాబాద్‌లోని టామ్‌కామ్ (TOMCOM) కార్యాలయంలో జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో మంత్రి సమావేశమయ్యారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో జర్మనీలో మంచి వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
Germany Job Opportunities | విశేష స్పందన
మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా శిక్షణ తరగతులకు విశేష స్పందన లభించిందని మంత్రి తెలిపారు. మందమర్రి కేంద్రంలో ఇప్పటికే సుమారు 200 మంది యువత జర్మన్ భాషా కోర్సులో చేరినట్లు వెల్లడించారు. విదేశీ ఉద్యోగాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకిగా మారుతోందని, దానిని అధిగమించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరై భాషపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఎన్నాళ్లు..? బ్లూ ప్రింట్ ఇదిగో.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!