Fertilizer Booking | రైతులకు అలర్ట్​.. ఇక అన్ని ఎరువులు యాప్​లో బుక్​ చేయాల్సిందే..

రాష్ట్రంలో ఇక నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటే యాప్​ ద్వారానే బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఈ నెల 6 నుంచి అమలులోకి రానుంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fertilizer Booking | రాష్ట్రంలో ఇక నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటే యాప్​ ద్వారానే బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఈ నెల 6 నుంచి అమలులోకి రానుంది.

తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం యూరియా బుకింగ్​ యాప్​ ద్వారా సాగుతోంది. ఫెర్టిలైజర్​ యాప్​లో యూరియా బుక్​ చేసుకొని.. నిర్ణిత గడువులోగా సంబంధిత డీలర్​ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలి. ఈ విధానంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్​ ఫోన్లు లేకపోవడం, చాలా మంది రైతులు చదువుకొని వారు ఉండటంతో బుక్​ చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. మరోవైపు ఆన్​లైన్​లో స్టాక్​ ఎంటర్​ చేసిన క్షణాల్లో ఖాళీ అవుతుండటంతో సైతం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యూరియా బుకింగ్​ విధానంతోనే ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. డీఏపీ, ఎన్​పీకే, ఎంవోపీ తదితర ఎరువులను సైతం ఇక నుంచి యాప్​లోనే బుక్​ చేసుకోవాలని స్పష్టం చేసింది.

Fertilizer Booking | కొత్త యాప్​

ప్రస్తుతం యూరియా మినహా మిగిలిన ఎరువులను నేరుగా డీలర్​ వద్దకు వెళ్లి రైతులు కొనుగోలు చేస్తున్నారు. యూరియాను మాత్రం ఫెర్టిలైజర్​ యాప్​ ద్వారా బుక్​ చేసుకుంటున్నారు. అయితే అన్ని ఎరువుల బుకింగ్​ కోసం ప్రభుత్వం కొత్త యాప్ తీసుకొచ్చింది. ఫ్రేమ్​వర్క్​ ఫర్​ ఫెర్టిలైజర్​ సేల్​ (FFS) యాప్​ ఇక అన్ని ఎరువులను బుక్​ చేసుకోవాలి. యూరియా, ఎన్​పీకే, డీఏపీ, పోటాష్​ (ఎంవోపీ) ఎరువులను దీని ద్వారా బుక్​ చేసుకోవచ్చు.

Fertilizer Booking | ఫార్మర్​ రిజిస్ట్రేషన్​ తప్పనిసరి

ఎఫ్​ఎఫ్​ఎస్​ యాప్​ ద్వారా ఎరువుల బుకింగ్​ కోసం రైతులు తప్పనిసరిగా ఫార్మర్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మర్​ రిజిస్ట్రీ చేసుకోని రైతులు ఏఈవోలను సంప్రదించాలి. రిజిస్ట్రేషన్​ అయ్యాక ఒక ఐడీ వస్తుంది. మీ సేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టడానికి ఈ విధానం తీసుకు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

Fertilizer Booking | ఇలా చేయాలి

ఫార్మర్​ రిజిస్ట్రేషన్​ చేసుకున్న రైతులు ఎఫ్​ఎఫ్​ఎస్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి. ఆధార్​ లేదా ఫార్మర్​ ఐడీ నంబర్​ ఆధారంగా లాగిన్​ కావాలి. అందులో భూమి వివరాలు సరి చూసుకోవాలి. ఏ పంట వేశామో యాడ్​ చేయాలి. అనంతరం కావాల్సిన ఎరువులను ఎంచుకొని బుకింగ్​ చేసుకోవచ్చు. ఎరువులను ఎంచుకున్న తర్వాత ఎక్కడ స్టాక్​ ఉందో.. సంబంధిత డీలర్ల వివరాలు కనిపిస్తాయి. మనకు కావాల్సిన డీలర్​ వద్ద బుకింగ్​ చేసుకోవచ్చు. అప్పుడు ఓ క్యూర్​ కోడ్ వస్తుంది. దానిని సేవ్​ చేసుకొని డీలర్​ వద్ద చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ఎరువులు ఇస్తారు.

ఇది కూడా చదవండి..: Srisailam Inflow | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *