Manjeera Survey | మంజీరలో అధికారుల సర్వే.. పత్తాలేని మహారాష్ట్ర అధికారులు

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Manjeera Survey | తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharashtra) మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు భూ వివాదం నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నది నుండి తమ భూ భాగంలో ఇసుక తోడుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే మహారాష్ట్ర ఇసుక క్వారీ నిర్వాహకులు తెలంగాణ భూభాగం నుండి సైతం ఇసుకను తీసుకెళ్లడంతో (Sand Quarry Issue) సరిహద్దు వివాదం తలెత్తింది.

Manjeera Survey | స్పందించని మహారాష్ట్ర అధికారులు

సరిహద్దులో ఇసుక వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సర్వే నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో శుక్రవారం తెలంగాణ రాష్ట్రం నుండి బోధన్ డివిజన్ అధికారులు హాజరయ్యారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం సర్వేకు రాకుండా ముఖం చాటేశారు. సాలూర మండలం హున్సా, మంజీర సరిహద్దుల వద్ద తెలంగాణ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించేందుకు పరికరాలతో సిద్ధమయ్యారు.

manjeera12

Manjeera Survey | ఉదయం నుంచి ఎదురుచూసినా పత్తాలేరు..

ఈ సర్వేలో పాల్గొనాల్సిన మహారాష్ట్ర రెవెన్యూ, సర్వే అధికారుల(Revenue Survey) కోసం తెలంగాణ యంత్రాంగం ఉదయం నుంచి ఎదురుచూసింది. అయితే అటువైపు నుంచి అధికారుల జాడ కనిపించలేదు. ఎలాంటి సమాచారం కూడా లేదు. ఒక పక్క అధికారుల సర్వేకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ మహారాష్ట్ర ఇసుక మాఫియా మాత్రం ఏమాత్రం భయం లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని సమాచారం. సర్వే జరుగుతోందన్న విషయాన్ని సైతం ఏమాత్రం లెక్కచేయకుండా వారి భూభాగంలో యథేచ్ఛగా ఇసుకను తవ్వుతున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద అధికారులు ఉన్నారన్న భయమే లేకుండా రవాణాను ఆపకుండా బహిరంగంగానే ఇసుకను దోచేస్తుండటం గమనార్హం.

nmanjeer3

ఇది కూడా చదవండి: Ameerpet Fire Accident | అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై కవిత ఫైర్.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *