Public Grievance Resolution | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Public Grievance Resolution | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.

ప్రజావాణికి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కరించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 2BHK గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమం తదితర వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Public Grievance Resolution | గడువులోగా పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజల నుంచి ప్రతిరోజూ అందుతున్న వినతులు, వాటి పరిష్కార స్థితి, శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్‌లతో మాట్లాడి ప్రజావాణి నిర్వహణ, సమస్యల పరిష్కార ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana School Uniform | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త యూనిఫామ్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *