అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Arvind | ఫీజు రీయింబర్స్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో ఉన్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంలో వాళ్లు విజయవంతం అయ్యారని విమర్శించారు. ఫీజు బకాయిల కోసం బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రీయింబర్స్మెంట్ రాకపోవడంతో 20 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
MP Arvind | మైనంపల్లి రోహిత్‌ను మంత్రి చేయాలి
రాష్ట్రంలో 12 ఏళ్ల నుంచి జాబ్ క్యాలెండర్ లేదని అర్వింద్ అన్నారు. యువతన మోసం చేస్తున్న సీఎం.. కొత్తగా జెన్‌జీలను కేంద్రంలో మంత్రి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీ మంత్రివర్గంలో జెన్‌జీ వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, యశస్విని రెడ్డి జెన్‌జీ తరానికి చెందిన వారని ఎంపీ పేర్కొన్నారు. వారికి విద్యాశాఖ ఇవ్వాలని సవాల్ చేశారు. తెలంగాణలో జెన్‌జీ యువతను మంత్రులు చేయాలన్నారు. ఇక్కడ చేయకుండా ఢిల్లీలో చేస్తామనడం విడ్డూరం అని విమర్శించారు.
MP Arvind | కేంద్రంపై బురద చల్లుతున్నారు
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సగటు వయసు 62 ఏళ్లు అని అర్వింద్ ధర్మపురి అన్నారు. అలాంటి వ్యక్తి కేంద్రంలో జెన్ జీలను మంత్రి చేస్తామనడం హస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక కేంద్రంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో ఆర్‌డీ విచారణ.. నిధుల గోల్‌మాల్‌పై సర్వత్రా చర్చ