Ankapur Model Market | అంకాపూర్​లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

అంకాపూర్​లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్:  Ankapur Model Market | అంకాపూర్​లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా క్వశ్చన్ అవర్​లో ఆయన మాట్లాడారు.

 Ankapur Model Market | వసతులు కల్పించాలి

రాకేష్ రెడ్డి (Rakesh Reddy) హార్టికల్చర్ అంశంపై మాట్లాడుతూ.. అంకాపూర్ గ్రామంలో మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి పండించిన కూరగాయలు మార్కెట్​కు తీసుకొచ్చే రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయని అలాగే తెల్లవారుజామున రెండు గంటల నుండి రైతులు కూరగాయల విక్రయాల కోసం పడిగాపులు కాస్తారని చెప్పారు. అంకాపూర్ నుండి హైదరాబాదుకు బెంగళూరుకు కొత్తిమీర వంటి వాణిజ్య పంటలను ఎక్స్​పోర్ట్​ చేస్తారన్నారు.

మొక్కజొన్న అమ్మకాలు ఏడాది పొడుగున జరుగుతాయని అంకాపూర్ అంటే దేశంలోని ఆదర్శ గ్రామమని, ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఏడాదికి రూ.5లక్షల వస్తాయని అంకాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీకి సబ్సిడీ ద్వారా కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఇవ్వడం ద్వారా అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. చుట్టుపక్కల రైతులు కూడా విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా తెలిపారు.

ఇది కూడా చదవండి..: 22A Prohibited Lands | 22–ఏతో భయం.. భయం.. జాబితాలోకి వేలాది ఎకరాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *