Jajala Surender | సమస్యలు చెప్పుకొంటే అరెస్టు చేయిస్తారా..? ఇదేనా ప్రజా ప్రభుత్వం: జాజాల సురేందర్‌

మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం, పోలీసులను ఉపయోగించి లాఠీచార్జి చేయించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Jajala Surender | ప్రజా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన గ్రామస్థులపై పోలీసులతో లాఠీచార్జి చేయించి, అరెస్టులు చేయించడం ప్రజా ప్రభుత్వ తీరు కాదని ఎల్లారెడ్డి Yellareddy మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శించారు.

కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై జిల్లా ఎస్పీని కలిసి వివరించేందుకు ఆయన శుక్రవారం రాత్రి తన అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

Jajala Surender | ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రయత్నిస్తే..

మల్కాపూర్‌ గ్రామానికి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల నిమిత్తం వచ్చిన సమయంలో కొందరు గ్రామస్థులు తమ సమస్యలను వివరించేందుకు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారని జాజాల సురేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేసి, సర్పంచి భర్తతో పాటు మరికొందరిని అరెస్టు చేసి నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆయన ఆరోపించారు.

Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?

గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడం ప్రజల హక్కు అని జాజాల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం అవుతుందా.. లేదా.. అనేది పక్కనపెడితే.. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు వినాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుందని అన్నారు.

Jajala Surender | ‘ప్రజలపైకి కారు దూసుకెళ్లడం దారుణం’

మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం, పోలీసులను ఉపయోగించి లాఠీచార్జి చేయించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేకాకుండా కారు వేగంగా ప్రజల వైపు తీసుకెళ్లారని, అనంతరం కొందరిని అరెస్టు చేయించడం దారుణమని విమర్శించారు.

మల్కాపూర్‌ ఘటనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించిన జాజాల.. ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు ఇందుకు నిదర్శనమని అన్నారు.

Jajala Surender | ‘మేమేమైనా దేశద్రోహులమా?’

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం, ఇబ్బందులకు గురిచేయడం ఎందుకని జాజాల ప్రశ్నించారు. ‘‘మేమేమైనా దేశద్రోహులమా? తీవ్రవాదులమా?’’ అని వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు తమను కలిసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేవారని, ప్రజల సమస్యలు వినడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని గుర్తుచేశారు.

Jajala Surender | ఎస్పీని కలవలేక వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే

మల్కాపూర్‌ ఘటనపై పూర్తి వివరాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుగా అనుమతి తీసుకుని కార్యాలయానికి వచ్చినట్లు జాజాల సురేందర్‌ తెలిపారు. అయితే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆయనను కలవలేకపోయామని చెప్పారు. మరోసారి సమయం తీసుకుని ఎస్పీని కలిసి ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

మల్కాపూర్‌ ఘటనపై జాజాల చేసిన ఆరోపణలపై అధికార కాంగ్రెస్‌ పార్టీ లేదా పోలీసుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *