అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Sanjay | ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) వెళ్లారు. ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో పాటు లంచ్ మీటింగ్‌కు ఆయన వెళ్లారు.
ఈ భేటీ భేటీ ఫొటోలను బండి సంజయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయంటూ పోస్ట్ చేశారు. ఎంపీలతో ఆనందకరమైన భోజనం, ఆలోచనాత్మకమైన సంభాషణ జరిపానని పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు నెలకొన్న విషయం తెలిసిందే. కరీంనగర్లో రెండు వర్గాల వారు గతంలో అనేక సార్లు విమర్శలు చేసుకున్నారు. బండి, ఈటల సైతం పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ వర్గపోరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.
Bandi Sanjay | అధికారమే లక్ష్యంగా..
బీహార్ (Bihar), బెంగాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ (BJP) తెలంగాణపై ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని కలలు కంటోంది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించారు. కేంద్ర మంత్రులు సైతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జులై 18 బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య పార్టీ నాయకులు సయోధ్య కుదిర్చారు. రెండు వర్గాలు ఉంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఇద్దరికి సర్ది చెప్పారు. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ఇరువురు నేతలతో సమావేశం అయ్యారు. కలిసి పని చేయాలని సూచించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు మాట్లాడుతూ.. తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. తాజాగా బండి సంజయ్ నివాసానికి ఈటల వెళ్లడంతో వారు కలిసి పోయారని తెలుస్తోంది.
దీనిని కూడా చదవండి : Rahul Gandhi on Modi | మోదీ, అమిత్ షాకు ధైర్యం లేదు : రాహుల్ గాంధీ