అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Electric Auto Scheme | హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026”ను రూపొందిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా కేబినెట్ ఆమోదం పొందిన ఈ పథకంపై ఆయన ఆదివారం కీలక వివరాలు వెల్లడించారు.
Telangana Electric Auto Scheme | పథకం లక్ష్యాలు..
హైదరాబాద్‌లోని CURE ప్రాంతంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న మొత్తం 18,766 ఆటో రిక్షాలను (ఇందులో 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి) దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. నగరంలోని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా CURE ప్రాంతంలోని అర్హత కలిగిన ఆటో యజమానులందరికీ ఈ పథకం వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Telangana Electric Auto Scheme | యజమానులకు రెండు వెసులుబాట్లు..
అర్హత కలిగిన ప్రతి ఆటో యజమానికి ప్రభుత్వం రెండు రకాల అవకాశాలు కల్పిస్తోంది. మొదటిది రెట్రోఫిటింగ్ విధానం కాగా, దీని ప్రకారం ప్రస్తుత ఆటోను AIS–123 ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్‌తో రెట్రోఫిట్ చేసుకోవచ్చు. రెండోది కొత్త ఈవీ కొనుగోలు విధానం, ఇందులో భాగంగా పాత ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా ఆటో యజమానికి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
Telangana Electric Auto Scheme |ప్రయోజనాలు..
ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం ద్వారా వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఆటో డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారం నుంచి భారీ ఆర్థిక ఉపశమనం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన గాలి, సుస్థిర ప్రజా రవాణా దిశగా తీసుకెళ్తూనే, డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026”ను రూపొందిస్తున్నాం. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా ఈ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
CURE ప్రాంతంలో ప్రస్తుతం… pic.twitter.com/elF2FJcKfq
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 16, 2026
ఇది కూడా చదవండి: Priyanka Murder Case | డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ నియామకం