అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Woman Murder | బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డగించి దుండుగులు దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద శనివారం రాత్రి భార్యాభర్తలు అనిల్ కుమార్, మీనా దేవి(35) బైక్‌పై వెళ్తుండగా కొందరు అడ్డగించారు. అనంతరం మీనా దేవిని పొదల్లోకి లాక్కెళ్లారు. అడ్డుకున్న భర్త అనిల్ కుమార్‌పై కత్తులతో దాడి చేసి, అతని ముందే మీనా దేవి గొంతు కోసి హత్య చేశారు.
Woman Murder | ఎందుకు చంపారు
దుండగులు భర్తను కత్తితో పొడిచి, మహిళ గొంతు కోసి పారిపోయారు. బాధితురాలి బంగారు ఆభరణాలు చెక్కుచెదరలేదని, లైంగిక దాడికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. దీంతో హత్య ఉద్దేశంపై మిస్టరీ మరింత పెరిగింది. మృతురాలి భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు, ఆస్తి తగదాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Extramarital Affair Murder | వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య


