Extramarital Affair Murder | వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Extramarital Affair Murder | వివాహతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా (Siddipet District)లో చోటు చేసుకుంది.

రాయపోల్ మండలం (Rayapol Mandal) రాంసాగర్‌లో శ్యామ్​చారి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో భార్యకు విడాకులు ఇచ్చాడు.

Extramarital Affair Murder | కోపం పెంచుకొని..

వివాహితతో సంబంధం పెట్టుకొని, ఆమె విడాకులకు కారణం అయ్యాడని సదరు మహిళ బంధువులు శ్యామ్​పై కోపం పెంచుకున్నారు. ఈ మేరకు ఈ నెల 26న ఆయనపై దాడి చేశారు. డ్రిప్​ పైపులు, కర్రలతో చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్​ మృతి చెందాడు. దాడికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడికి పాల్పడిన 20 మందిని అరెస్ట్ చేశారు.

Extramarital Affair Murder | ప్రాణాలు పోతున్నా..

Extramarital Affair Murder

రాష్ట్రంలో వివాహేతర సంబంధాలతో అనేక హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడితో కలిసి కొంతమంది మహిళలు భర్తలను చంపుతున్నారు. మరికొందరు భర్తలు భార్యల అడ్డు తొలగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు సైతం దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు ఈ అనైతిక బంధంతో పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. పలువురు కట్టుకున్న వారిని కాదని, ఇతరుల మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాత్కాలిక సుఖం కోసం నేరాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరైతే కన్న బిడ్డలను కడతేరుస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kharge Hyderabad Visit | ఖర్గేకు ఘన స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *