Tirumala Hotel Theft | శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చే లోపు.. వెయ్యి డాలర్లు మాయం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala Hotel Theft | తిరుమల (Tirumala)లో దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల సొమ్మును చోరీ చేస్తున్నారు. తాజాగా ఓ భక్తుడికి సంబంధించిన వెయ్యి డాలర్లను ఎత్తుకెళ్లారు.

సింగపూర్ నుంచి ఎన్నారై ఆర్ముగం కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. మారస సరోవరం హోటల్ (Marasa Sarovaram Hotel) రూమ్ నెంబర్ 1017లో వారు బస చేశారు. శుక్రవారం ఉదయం స్వామి వారి దర్శనానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికి హోటల్​ రూమ్​లో ఉన్న వెయ్యి డాలర్లు కనిపించలేదు. దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో (Alipiri Police Station) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tirumala Hotel Theft | భద్రత కరువు

Tirumala Hotel Theft

ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీ అయ్యాయి. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశా విదేశాల నుంచి వచ్చే భక్తులు హోటళ్లలో బస చేస్తారు. అయితే హోటళ్ల నుంచి డబ్బులు మాయం కావడంపై వారు ఆందోళన చెందుతున్నారు. తిరుమల క్షేత్రంలో భద్రత కరువైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirumala Hotel Theft

ఇది కూడా చదవండి..: Vishaka Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ముగ్గురి దుర్మరణం.. పలువురికి గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *