అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Travels Bus Accident | ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్లపైకి బస్సు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
లారీ డ్రైవర్లు తమ వాహనాలను ఆపి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు, మితిమీరిన వేగంతో వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా.. పోలీసులు, హైవే సిబ్బంది రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేశారు
Travels Bus Accident | బాలికపైకి దూసుకెళ్లిన ఆటో
హైదరాబాద్ నగరంలోని హైదర్‌షాకోట్ యాదవ్ భవన్ హోటల్ సమీపంలో ఓ బాలికను ఆటో ఢీకొంది. ఇల్లు దాటి బయటకు వస్తున్న శ్రీహరిక(11) అనే బాలికను వేగంగా వచ్చిన ఒక ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్ అర్బాజ్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: కుప్పంలో సరికొత్త ఈవీ ప్లాంట్ గ్రీన్ సిటీ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వంతో ఈమోటరాడ్ ఒప్పందం