Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - జాతీయం

జాతీయం

Delhi Restaurant Fire | ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

Shivam nagarani
Last updated: June 3, 2026, 1:44 pm 1:44 pm
Shivam nagarani
Share
delhi

అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Restaurant Fire | దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. మాల్వియా నగర్‌లోని ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు రెస్టారెంట్ అంతటా వ్యాపించడంతో, అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లు అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, ఘటన స్థలంలో ఎగిసిపడుతున్న మంటలు, హృదయవిదారక దృశ్యాలు స్థానికులను తీవ్రంగా కలచివేసాయి.

Delhi Restaurant Fire | పెరిగిన మృతుల సంఖ్య..

ప్రమాదం జరిగిన మొదట్లో 10 మంది మరణించినట్లు సమాచారం రాగా, ఫైర్ సిబ్బంది , పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసిన తర్వాత మరో పది మృతదేహాలను వెలికితీశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20 కి చేరింది. కాగా, అగ్నిమాపక, పోలీస్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాద స్థలం నుండి 35 మందిని సురక్షితంగా రక్షించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందులో రెస్టారెంట్ సిబ్బంది కూడా సజీవదహనమవ్వడం తీవ్ర విషాదాన్ని నింపింది.

delhi.1

Delhi Restaurant Fire | ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి ..

Delhi Restaurant Fire

ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi )తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ, మరణించిన వారి కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం, అధికారులు అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి (మృతుల వారసులకు) పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. దీనితో పాటు, ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Pension Live Authentication | వినాయక్​నగర్​లో పింఛన్ లైవ్​​ అథెంటికేషన్ ​

 

TAGGED:breaking newsDelhi NewsDelhi Restaurant Firefire accidentIndia newslatest newsMalviya Nagar FireNarendra ModiRestaurant Blazetelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Kolkata Cash Bundles  Kolkata Cash Bundles | కోల్‌కతాలో నోట్ల కట్టల కలకలం..
Next Article KTR Padayatra KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Work From Home
జాతీయం

Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

By Balla Sandeep Kumar
Air India Crash Report
జాతీయం

Air India Crash Report | అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. నేరుగా తుది నివేదికే ఇస్తామన్న కేంద్రం

By Shivam nagarani
Bakrid Cow Slaughter PIL
జాతీయం

Bakrid Cow Slaughter PIL | గోవధ నిషేధ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

By Shivam nagarani
Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..
జాతీయంఅంతర్జాతీయం

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.