Delhi Rally Postponement | ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీని వాయిదా వేయండి.. సోనియాకు వ్యాపారుల లేఖ

ఇండియా కూటమి నవంబర్‌ 1న తలపెట్టిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే దీనిని వాయిదా వేయాలని సోనియా గాంధీకి ఢిల్లీ వ్యాపారులు కోరారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Delhi Rally Postponement | ఇండియా కూటమి నవంబర్‌ 1న తలపెట్టిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే దీనిని వాయిదా వేయాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి ఢిల్లీ వ్యాపారులు కోరారు. ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) లేఖ రాసింది.

Delhi Rally Postponement | పండుగల సీజన్ నేపథ్యంలో..

పండుగల సీజన్ వ్యాపారాలకు అత్యంత కీలకమైన సమయం కాబట్టి.. ఇలాంటి టైంలో ర్యాలీ నిర్వహించడం వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీకి వచ్చే వారి వల్ల ఇరవైకు పైగా మార్కెట్లలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందన్నారు. ఈ ర్యాలీ వల్ల తమకు రూ.10,000 కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు.

Delhi Rally Postponement | ర్యాలీని వ్యతిరేకించడం లేదు..

పది లక్షల మందితో చేపట్టబోయే మెగా ర్యాలీని తాము వ్యతిరేకించడం లేదని వ్యాపారులు పేర్కొన్నారు. దీపావళి నేపథ్యంలో వాయిదా వేయాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కోరుతున్నాయన్నారు. నవంబర్ 6న ధంతేరస్, నవంబర్ 8న దీపావళి పండుగ ఉండడంతో వ్యాపారుల సరుకుల రవాణా, కొనుగోలుదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. దీపావళి సమయంలో మా జీవనోపాధిని కాపాడుకోవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Gold and Silver Prices | భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే?

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *