అక్షరటుడే, వెబ్డెస్క్: Low Pressure in Bay of Bengal | వాతావరణం మళ్లీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటోంది. ఇప్పటికే కురిసిన వర్షాల ప్రభావం నుంచి ప్రజలు తేరుకోకముందే… మరో ముప్పు ముంచుకొస్తోంది! అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది!
Low Pressure in Bay of Bengal | రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
అండమాన్ పరిధి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా బలపడి… రాబోయే అక్టోబర్ 31 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు! దీని ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
మరోవైపు, గతంలో ఆందోళన రేకెత్తించిన ‘అర్నబ్’ వ్యవస్థ క్రమంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ, కొత్తగా ఏర్పడుతున్న ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉండబోతుందనే దానిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచారు.
వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: GPO Bribery Case | రూ.22 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జీపీవో