Telangana Heavy Rain | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Heavy Rain | అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. రాబోయే 24 గంటల్లో ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

రాష్ట్రం (Telangana)లో అల్ప పీడన ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 25 వరకు వర్షాలు పడుతాయి. నిన్నటి వరకు పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. నేటి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాబోయే 24 గంటల్లో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు జల్లులు పడుతాయి.

Telangana Heavy Rain | రైతుల హర్షం

పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి వర్షం పడింది. బుధవారం ఉదయం నుంచి వాతావారణం మేఘావృతమై ఉంది. నాలుగు రోజులు వర్షాలు పడుతుండటం, అల్ప పీడన ప్రభావంతో మరిన్ని వర్షాలు వస్తాయని అధికారులు చెబుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో వరి పంట చేతికొస్తుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అయితే ఇటీవల వర్షాలు లేకపోవడం, కరెంట్​ రాకపోవడంతో నీరందక పొలాలు ఎండిపోయాయి. ఈ క్రమంలో వరుణుడు కరుణ చూపాడని అన్నదాతలు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..: Visakhapatnam-Kirandul trains | భారీ వర్షాలు.. విశాఖ-కిరండోల్ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *